జగన్‌కు షాక్... సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో పిటిషన్

news18-telugu
Updated: January 22, 2020, 10:28 AM IST
జగన్‌కు షాక్... సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో పిటిషన్
జగన్, హైకోర్టు
  • Share this:
ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఆర్డీఏ రద్దు చట్టంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఆర్డీఏ రద్దు చట్టంపై హై కోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లు సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. బిల్లు నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు పిటిషినర్ విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం, మంత్రులను ప్రతివాదులుగా చేర్చుతూ పిల్ దాఖలు చేశారు. మరోవైపు అమరావతి రైతులు ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ ఆ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోర్టును తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం మూడు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఇవాల్టీతో ఆ సమావేశాలు ముగియనున్నాయి. మొదటిరోజు కీలకమైన బిల్లులను సభలో ప్రవేశ పెట్టింది జగన్ సర్కార్. మూడురాజధానులకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టగా... సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స ప్రవేశ పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతిలో రాజధాని కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం సభలో చర్చ..ఆమోదం కోసం బిల్లును మంత్రి బొత్సా ప్రతిపాదించారు. దీని ద్వారా గతంలో ఈ చట్టం కింద చేసుకున్న అన్ని నిర్ణయాలు రద్దు కానున్నాయి.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు