ఆర్టీసీ సమ్మెపై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు.. షాక్‌ తిన్న మంత్రి..

ఆర్టీసీ సమ్మెపై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, కార్మికుల సంఘాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 14, 2019, 1:43 PM IST
ఆర్టీసీ సమ్మెపై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు.. షాక్‌ తిన్న మంత్రి..
ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
ఆర్టీసీ సమ్మెపై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, కార్మికుల సంఘాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ అవార్డుల స్వీకరణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలతో మాట్లాడి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ సమ్మె ఉవ్వెత్తున సాగుతోందని, దాని ప్రభావంతో సామాన్యులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులను దూరం పెట్టాలని చూడటం సరికాదని, కార్మిక సంఘాలతో ఇప్పటికైనా మాట్లాడి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేయాలని హితవు చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్‌కు, కార్మికులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, అందువల్ల ఇరు వర్గాలు కూర్చొని చర్చించి, శాంతియుత వాతావరణం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

విద్య, వైద్యం, విమానయానం, రైల్వే, ఆర్టీసీ.. ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ దిశగా సాగడం ఆందోళన చెందాల్సిన విషయం అని అన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వెంటనే సీఎం, కార్మిక సంఘాలు చర్చలు జరిపి వీలైనంత త్వరగా మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, తెలుగు ప్రభుత్వాలు నంది అవార్డులను ప్రకటించి, మర్చిపోయాయని చెప్పిన నారాయణ మూర్తి.. సొంత ఖర్చుతో సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులు అందజేస్తున్న సుద్దాల అశోక్ తేజను ఆయన అభినందించారు.

కాగా, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆర్.నారాయణ మూర్తితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి సమ్మెపై చేసిన వ్యాఖ్యలు మంత్రిని కాస్త ఇబ్బందికి గురిచేశాయి. ఒకానొక సందర్భంలో అవార్డుల ప్రధాన కార్యక్రమంలో సమ్మెపై ఆయన వ్యాఖ్యలు చేయడం మంత్రికి షాక్ తగిలినట్లు అనిపించడం గమనార్హం.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు