ఆ విషయంలో మోదీ ప్రపంచంలోనే 'ది బెస్ట్'.. : ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని సలెంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోనూ మోదీపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. అభివృద్ది ఎజెండా కంటే.. పబ్లిసిటీ, అబద్దాలతోనే మోదీ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: May 17, 2019, 4:00 PM IST
ఆ విషయంలో మోదీ ప్రపంచంలోనే 'ది బెస్ట్'.. : ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ (File)
news18-telugu
Updated: May 17, 2019, 4:00 PM IST
సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్నవేళ కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. తాజాగా తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు అని విమర్శించిన ప్రియాంక.. దేశ ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని సెటైర్ వేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

మీరో విషయాన్ని అర్థం చేసుకోవాలి.. ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడైన ప్రధానిని మీరు ఎన్నుకున్నారు. దానికి బదులు అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా ఎన్నుకోవాల్సింది.
ప్రియాంక గాంధీ, తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి


అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లోని సలెంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోనూ మోదీపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. అభివృద్ది ఎజెండా కంటే.. పబ్లిసిటీ, అబద్దాలతోనే మోదీ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని.. కానీ మోదీ మాత్రం అవాస్తవాలతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల ఆయన పాలనలో ఐదంటే ఐదు నిమిషాలు వారణాసిలోని పేదల కోసం వెచ్చించలేకపోయాడని మండిపడ్డారు. ప్రచారమే తప్ప ప్రజల కోసం మోదీ చేసిందేమి లేదని స్పష్టం చేశారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...