కంటతడి పెట్టిన మాజీ సీఎం.. నాకు రాజకీయాలొద్దంటూ..

లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్ ఓటమిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమ ఉంటే చాలని అన్నారు కుమారస్వామి.

news18-telugu
Updated: November 27, 2019, 7:19 PM IST
కంటతడి పెట్టిన మాజీ సీఎం.. నాకు రాజకీయాలొద్దంటూ..
కన్నీటిపర్యంతమైన కుమారస్వామి
  • Share this:
కర్నాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ప్రచారాన్ని వేడెక్కించాయి. ఈ క్రమంలో బుధవారం మాండ్యా జిల్లాలో మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి పర్యటించారు. కృష్ణరాజపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి బీఎల్ దేవరాజ్ తరపున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన కుమారస్వామి కన్నీంటి పర్యంతమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్ ఓటమిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమ ఉంటే చాలని అన్నారు కుమారస్వామి.

నాకు రాజకీయాలు వద్దు. సీఎం పదవి అవసరం లేదు. మీ ప్రేమ మాత్రమే నాకు కావాలి. నా కుమారుడు నిఖిల్ ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడంలేదు. మాండ్యా నుంచి అతడిని పోటీ చేయించాలని నేను అనుకోలేదు. మాండ్యా ప్రజలే నిఖిల్‌ను కోరుకున్నారు. కానీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు. అదొక్కటే బాధ కలిగిస్తోంది.
కుమార స్వామికాగా, డిసెంబరు 5న కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కుమారస్వామి బలపరీక్ష సందర్భంగా 15 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించడంతో వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబరు 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
Published by: Shiva Kumar Addula
First published: November 27, 2019, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading