• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PEOPLE DID NOT VOTE SUSPENSION OF PENSIONS IN SRIKAKULAM NGS

Andhra Pradesh: చెప్పిన అభ్యర్థికి ఓటే వేస్తేనే ఫించన్.. లేదంటే కట్ ఎక్కడో తెలుసా?

Andhra Pradesh: చెప్పిన అభ్యర్థికి ఓటే వేస్తేనే ఫించన్.. లేదంటే కట్ ఎక్కడో తెలుసా?

ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీకు పథకాలు కట్ చేస్తామని ఓటర్లను అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడడం వింటూనే ఉంటాం. కానీ ఇవన్నీ ప్రచారల్లో భాగమే. అయితే ఎన్నికలు అయ్యాక అంతా మరిచిపోతారు.. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పరిస్థితి వేరు.. అధికార పార్టీకి ఓటు వేయనందుకు తమ ఫించన్లు నిలిపివేశారని 106 మంది ఆందోళన బాట పట్టారు.

ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీకు పథకాలు కట్ చేస్తామని ఓటర్లను అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడడం వింటూనే ఉంటాం. కానీ ఇవన్నీ ప్రచారల్లో భాగమే. అయితే ఎన్నికలు అయ్యాక అంతా మరిచిపోతారు.. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పరిస్థితి వేరు.. అధికార పార్టీకి ఓటు వేయనందుకు తమ ఫించన్లు నిలిపివేశారని 106 మంది ఆందోళన బాట పట్టారు.

  • Share this:
    ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో  చాలా చోట్ల అధికార పార్టీ నేతల బెదిరింపుల గురించి విన్నాం. వీడియోలు కూడా బయటకు వచ్చాయి.  అయితే ఇవి కేవలం బెదిరింపుల వరకే ఉంటాయని.. ఎన్నికలు ముగియ గానే అంతా మరిచిపోతారని అనుకుంటారు. ఏపీ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారాల సమయాల్లోనే చాలా చోట్ల అధికార పార్టీ నేతలు బెదిరింపులపై ఫిర్యాదులు కూడా అందాయి. తమ మద్దతు దారులకు ఓటు వేస్తేనే మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. లేదంటే అన్ని పథకాలు కట్ చేస్తాం అంటూ ప్రకటనలు అక్కడక్కడా చూశాం. పలు జిల్లాల్లో ఈ ప్రచారాలపై ఫిర్యాదులు నమోదయ్యాయి కూడా..

    ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో  ఏ పార్టీ నాయకులు ఉన్నా.. అక్కడక్కడా ఇలాంటి బెదిరింపులు సాధారణంగా కనిపించేవే.  అయితే చాలా చోట్ల ఈ బెదిరింపులను ఓటర్లు పట్టించుకోలేదు.  తమకు నచ్చిన అభ్యర్ధికి  ఓటు వేసి ఇలాంటి బెదిరింపులను పట్టించుకోలేదు.  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రలోనూ ఇలా అధికార పార్టీ నేతలు ఎక్కడైతే బెదిరింపులకు పాల్పడ్డారో ఆయా చోట్ల ప్రత్యర్థి పార్టీల మద్దతు దారులు గెలిచారు.

    అయితే శ్రీకాకుళం జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్య ర్థికి ఓటు వేయలే దన్న కక్షతో తమ పింఛన్లు నిలిపివేశారని అప్పల పేట గ్రామస్థులు నిరసనకు దిగారు. బూర్జ మండలపరిషత్‌ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకుడు అన్నెపు రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదని, తమ పార్టీకి ఓటు వేయలేదనే నెపంతో పింఛన్లు నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే తమకు మళ్లీ పెన్షన్లు మంజూరు చేసినంత వరకు అక్కడ నుంచి కదిలేది లేదని డిమాండ్ చేశారు.

    బూర్జు మండలంలో వివిధ పంచాయతీలకు చెందిన 106 మంది పింఛన్ల ఈ నెల నిలిచపోయాయి. అయితే వీరంతా టీడీపీ సానుభూతిపరులే కావడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం ఓట్లు వేయలేదనే కారణంతోనే తమకు ఫించను నిలుపుదల చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి తక్షణమే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు ఇలా నిరసన బాట పట్టారు.

    ఈ ఘటనపై విపక్షాలు అన్నీ మండిపడుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే అధికార పార్టీ నేతలు ఇలా బెదిరింపులకు దిగితే.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అని నిలదీస్తున్నారు.  బెదిరింపులకు దిగుతున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు