Home /News /politics /

PEDDAPALLI LOKSABHA CONSTITUENCY PROFILE WHO WILL WIN NOW NK

Your Parliament : పెద్దపల్లి లోక్ సభ స్థానంలో ఈసారి గెలిచేదెవరు... సిట్టింగ్ ఎంపీ అభివృద్ధి చేశారా...

పెద్దపల్లి నియోజకవర్గం మ్యాప్ (Image : Google Maps)

పెద్దపల్లి నియోజకవర్గం మ్యాప్ (Image : Google Maps)

Your Parliament : మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలిచే పెద్దపల్లి లోక్ సభ స్థానంలో అభివృద్ధి ఎంతవరకూ జరిగింది...

Your Parliament : తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇదీ ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. పారిశ్రామికంగా ముందంజలో ఉన్న పార్లమెంట్ నిజయోకవర్గం ఇది. దీన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఓవైపు సింగరేణి సిరులు, మరోవైపు ఎన్టీపిసి వెలుగులు, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, (ఎఫ్‌సిఐ) ఫెర్టీలైజర్ ఫ్యాక్టరీ ఇలా పెద్ద పెద్ద పారిశ్రామిక వనరులు కల్గిన పార్లమెంట్ స్థానం ఇది. దీని పరిధిలో పెద్దపల్లి పాటు చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

నియోజకవర్గం నుంచీ గెలుపొందిన అభ్యర్థులు :














































































కాలంగెలిచిన అభ్యర్థిపార్టీ
1962-67ఎం.ఆర్.కృష్ణకాంగ్రెస్
1967-71ఎం.ఆర్.కృష్ణకాంగ్రెస్
1971-77వి.తులసీరాంతెలంగాణా ప్రజా సమితి
1977-80వి.తులసీరాంకాంగ్రెస్
1980-84జి.భూపతిటీడీపీ
1984-89జి.భూపతిటీడీపీ
1989-91జి.వెంకటస్వామికాంగ్రెస్
1991-96జి.వెంకటస్వామికాంగ్రెస్
1996-98జి.వెంకటస్వామికాంగ్రెస్
1998-99డా. చెల్లమెల్ల సుగుణ కుమారిటీడీపీ
1999-04డా. చెల్లమెల్ల సుగుణ కుమారిటీడీపీ
2004-09జి.వెంకటస్వామికాంగ్రెస్
2009-14జి.వివేకానంద్కాంగ్రెస్
2014 -19బాల్క సుమన్‌టీఆర్ఎస్

పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులను బయటి నుంచి తీసుకొచ్చి పోటీలో నిలిపాయి. పార్టీ అధిష్ఠానాల సూచన మేరకు బరిలో నిలిచిన ముఖ్య నాయకులు విజయం సాధించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, టీఆర్ఎస్ ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులనే పోటీలోకి దింపాయి. జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జి.వెంకటస్వామితో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులను పెద్దపల్లి ఓటర్లు ఆదరించారు. 1960కి ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న తెలంగా ప్రజా సమితి నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 16 సార్లు జరిగిన ఎన్నికల్లో పోటీలో నిలిచిన ప్రధాన ప్రత్యర్థులు 28 మంది ముఖ్య నాయకుల్లో ఇద్దరు తప్ప మిగతా వారంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేసిన వారే.

పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 1971లో టీపీఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన వి.తులసీరాం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎం.ఆర్‌.కృష్ణ పై గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌ ప్రాంతానికి చెందిన తులసీరాం టీపీఎస్‌ నుంచి మొదటి సారి పోటీ చేసి గెలుపొందిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. రెండుసార్లు వరుసగా గెలుపొందిన తులసీరాం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు.

pawan kalyan,narendra modi,chandra babu,jagan,kcr,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,నరేంద్ర మోదీ,చంద్రబాబు,జగన్,వైఎస్ జగన్,కేసీఆర్,రాహుల్ గాంధీ,పవన్ కల్యాణ్,
బాల్క సుమన్, టీఆర్ఎస్


1980లో జరిగిన ఎన్నికల్లో కోదాటి రాజమల్లు విజయం సాధించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం స్వస్థలమైన రాజమల్లు వృత్తిరీత్యా బెల్లంపల్లిలో పనిచేశారు. అంతకంటే ముందు చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ రాజకీయంగా ఎదిగారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పోటీకి సూచించడంతో ఆయన తొలిసారిగా పార్లమెంటు స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన నాయకులంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేసిన వారే. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తొలిసారిగా 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఆర్‌.కృష్ణ హైదరాబాద్‌ బొల్లారం ప్రాంతానికి చెందిన వారు. అంతకు ముందు కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీపీఎస్‌ నుంచి రెండుసార్లు గెలిచిన తర్వాత పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడటంతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1962, 1967 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 1971 ఎన్నికల్లో ఓటమి పాలైన ఎం.ఆర్‌.కృష్ణ ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన గొట్టె భూపతి 1984లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

టీడీపీ నాయకత్వం పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయన తంగళ్లపల్లి నుంచి వలస వచ్చి బరిలో నిలిచారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత తన స్వస్థలం నేరెళ్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకునిగా రాజకీయ చతురత ఉన్న వెంకటస్వామి పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తొలిసారిగా 1989లో పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి అప్పటికే మూడుసార్లు సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఎస్సీ రిజర్వేషన్‌ తొలగించడంతో పెద్దపల్లికి వలస వచ్చారు. తొలిసారిగా 1989లో గెలుపొందిన వెంకటస్వామి, 1991, 1996ల్లో వరుసగా విజయాన్ని అందుకున్నారు. మళ్లీ 2004లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వెంకటస్వామి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు.

pawan kalyan,narendra modi,chandra babu,jagan,kcr,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,నరేంద్ర మోదీ,చంద్రబాబు,జగన్,వైఎస్ జగన్,కేసీఆర్,రాహుల్ గాంధీ,పవన్ కల్యాణ్,
సింగరేణి లోగో


1998లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన చెలిమెల సుగుణకుమారీ అప్పటికే రాజకీయంగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న వెంకటస్వామిని ఓడించి చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన సుగుణకుమారీ వృత్తిరీత్యా వైద్యురాలు. రాజధానిలో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను టీడీపీ నాయకత్వం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తొలిసారిగా 1998లో బరిలోకి దించింది. తొలి పోటీలోనే విజయం సాధించిన సుగుణకుమారీ ఆ తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లోను విజయం సాదించింది. రెండు సార్లు వెంకటస్వామిని ఓడించి తనదైన ముద్ర వేసుకున్న సుగుణకుమారీ ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో వెంకటస్వామి చేతిలోనే ఓడిపోవడంతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా చురుకైన పాత్ర పోషించిన బాల్క సుమన్‌ పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన సుమన్‌ విద్యార్థి నాయకునిగా హైదరాబాద్‌లోనే తన కార్యకలాపాలు సాగించారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించడంతో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన సుమన్‌ భారీ మెజారీటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.


2009లో జరిగిన ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన జి.వివేక్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వివేక్‌ తొలి ఎన్నికల్లోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వివేక్‌ తండ్రి వెంకటస్వామి రాజకీయ వారసునిగా బరిలో నిలిచిన వివేక్‌ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.

ప్రత్యర్థులూ ఇతర ప్రాంతాల వారే :
ఇప్పటి వరకు పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన ప్రత్యర్థులు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారే. విజేతల చేతిలో ఓడిపోయిన నాయకులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వారే ఉన్నారు. తొలి రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సీపీఐ అభ్యర్థి పలణివేలు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు. రెండు సార్లు ఎం.ఆర్‌.కృష్ణ చేతిలో ఓడిపోయారు. ఇక్కడి నుంచి 1977లో బీఎల్డీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బంగారు లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు చెందిన వారే. 1984లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గంట శ్రీహరి కరీనంగర్‌ ప్రాంత వాసి. 1991, 1996లలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య స్వగ్రామం జగిత్యాల మండలం అంతర్గాం. 1980లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పర్స రాజలింగు మాత్రమే

గోదావరిఖనికి చెందిన వారు కాగా, 2009లో మహాకూటమి(టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస్‌ కాటారం మండలానికి చెందిన వారు. కేవలం ఇద్దరు మాత్రమే పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నివాసం ఉన్న వారే పోటీ చేశారు. అయితే ఆ ఇద్దరు కూడా విజయం సాధించలేకపోయారు.


ఇతర ప్రాంతాల వారికీ పెద్దపీట :
పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు మధ్యన పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో చెన్నూర్‌ అసెంబ్లీ మినహా నువ్వా నేనా అనేలీ పోటీ కొనసాగింది. దీంతో పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో సహా ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

మాజీ ఎంపీ వివేక్‌ టీఆర్ఎస్ టికెట్ ఆశించిన గులాబీ బాస్ ఆదరించకపోవడంతో వెనుదిరిగారు. టీఆర్ఎస్ పార్టీనుంచి బరీలో ఉన్న వెంకటేశ్ నేత ఉద్యోగానికి రాజీమానా చేసి రాజకీయల్లోకి వచ్చారు. స్థానికంగా చురుక్కుగా ఉండే అభ్యర్థిని బిజేపి టిక్కెట్ ఖరారు చేసింది. సీనియర్ జర్నలిస్టు గా పనిచేసిన ఎస్. కుమార్ కు రాజకీయ లపై సుధీర్ఘ పట్టు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్‌ పేరును పార్టీ ఖరారు చేసింది. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అనూహ్యంగా ఇక్కడి స్థానంలో పోటీ చేయించేలా అధిష్ఠానం నిర్ణయాన్ని తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు.















































Published by:Krishna Kumar N
First published:

Tags: Lok Sabha Election 2019, Peddapalle S29p02, Telangana, Telangana Lok Sabha Elections 2019

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు