PC Chaco: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గుడ్ బై.. కేరళ ఎన్నికలకు ముందు షాక్

పీసీ చాకో (Image; ANI)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు పీసీ చాకో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు చెప్పారు.

  • Share this:
    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు పీసీ చాకో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు చెప్పారు. కేరళకు చెందిన ఆయన రాజీనామా చేయడం నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికలకు ముందు షాక్ తగిలింది. కేరళలో స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన పీసీ చాకో కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మొదటిసారి పిరవం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈకే నాయనర్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మూడు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన 2జీ స్కాంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో చిలకుడి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 74 ఏళ్ల పీసీ చాకో ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అది కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం విశేషం. ఆయన మరేదైనా పార్టీలో చేరతారా? లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాను తన రాజీనామాను సోనియాగాంధీకి పంపినట్టు మాత్రమే ఆయన తెలిపారు.

    కేరళలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. ఈసారి కూడా మార్పు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. పినరయి విజయన్ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని ఆరోపించింది. దేశంలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్కాంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఉందనే ఆరోపణలు రావడంతో ఆ మరక ముఖ్యమంత్రికి చుట్టుకుంది.

    ఇక కేరళలో జెండా పాతాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. మెట్రో మ్యాన్ గా పేరుపొందిన శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, దానిపై సొంత పార్టీలో అసంతృప్తి రావడంతో దానిపై వెనక్కి తగ్గింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: