Delhi Results: ఓటమికి షీలా దీక్షిత్‌‌ను నిందించిన కాంగ్రెస్ సీనియర్ నేత

Congress vs Congress | ఢిల్లీలో కాంగ్రెస్ ఘోర పరాభవానికి మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను నిందిస్తూ సీనియర్ నేత పీసీ ఛాకో చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ మిలింద్ దేవ్‌రా తప్పుబట్టారు.

news18-telugu
Updated: February 12, 2020, 2:49 PM IST
Delhi Results: ఓటమికి షీలా దీక్షిత్‌‌ను నిందించిన కాంగ్రెస్ సీనియర్ నేత
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చురేపుతున్నాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి పీసీ ఛాకో తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలు హస్తగతం చేసుకోగా...బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 ఎన్నికల్లానే ఈ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం, ధివంగత షీలా దీక్షిత్‌‌ను నిందిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా కొత్త పార్టీ ఆప్ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్‌తో ఉందని ఆయన పేర్కొన్నారు.

congress vs congress, congress delhi results, pc chacko on sheila dikshit, delhi election results 2020, delhi results 2020, milind deora, delhi congress, పీసీ ఛాకో, ఢిల్లీ ఫలితాలు 2020, మిలింద్ దేవ్‌రా, షీలా దీక్షిత్
కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ ఛాకో(ఫైల్ ఫోటో)


ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి షీలా దీక్షిత్‌ను నిందిస్తూ పీసీ చాకో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ ఎంపీ మిలింద్ దేవ్రా తప్పుబట్టారు. షీలా దీక్షిత్ అద్భుతమైన రాజకీయ నాయకురాలు, పరిపాలనా దక్షత కలిగిన నేతగా కొనియాడారు. ఆమె ఢిల్లీ సీఎంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె మరణానంతరం ఢిల్లీలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం, ఢిల్లీ ప్రజల కోసం అంకితం చేసిందని మిలింద్ దేవ్‌రా కొనియాడారు.



ఇది కూడా చదవండి

Cong vs Cong: చిదంబరం వ్యాఖ్యల చిచ్చు...కాంగ్రెస్ దుకాణాన్ని మూసేద్దామా?
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు