తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె 12వ రోజుకు చేరింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటూ పేర్కొంది.
సోమవారం లోపు మొత్తం ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని కోర్టు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. 49,190 మంది ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వమే కక్ష పూరితంగా ప్రవర్తిస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్పై విచరాణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.