Pawan Kalyan: జనసేన విషయంలో పవన్ కీలక నిర్ణయం... ఇకపై ఆ దారిలో వెళ్లాలని డిసైడ్ అయ్యాడా..?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కులమతాలతో సంబంధం రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని.., పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తన్నట్లు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడూ ప్రకటిస్తుంటారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కులమతాలతో సంబంధం రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని.., పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తన్నట్లు పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. ఐతే ఇప్పుడు జనసేనాని తన రూటు మార్చాడా..? ఫ్యాన్ బేస్ తో పార్టీ నడవదని డిసైడ్ అయ్యాడా..? ఏపీ రాజకీయాలకు కుల సమీకరణ కూడా అవసరమని భావిస్తున్నాడా..? అందుకే బలమైన సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో గబ్బర్ సింగ్ ఉన్నాడా..? 2014లో టీడీపీకి సపోర్ట్,2019లో ఒకే ఒక్క సీటు. పోటీ చేసిన రెండు చోట్ల పార్టీ అధ్యక్షుడి ఓటమి. గెలుస్తారనుకున్న నేతలంతా ఫ్లాప్. ఇదీ జనసేన రాజకీయ ప్రస్థానం. జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ లక్షల్లో జనం వాలిపోతారు. పవన్ పర్యటనల్లో జనసునామీ కనిపిస్తుంది.

  ఓటు బ్యాంకుగా మారని ఫ్యాన్స్
  జనసేన మీటింగులకు వచ్చే వాళ్లు ఆ పార్టీకి ఓట్లేస్తే పవన్ ఈపాటికి సీఎం కుర్చీలో కూర్చొ ఉండేవారు. కానీ ఫ్యాన్ బేస్ జనసేనను నిలబెట్టలేదు. జనసేనకు వచ్చే మద్దతు, బలం, బలగం అంతా సోషల్ మీడియాలోనూ, బహిరంగ సభల్లో మాత్రమే. కానీ బ్యాలెట్ కు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. సాంప్రదాయానికి భిన్నంగా రాజకీయాలు చేయడం, ఫ్యాన్స్ ను నమ్ముకోవడమే జనసేన బలమైన పార్టీగా ఎదగలేకపోతోందన్నది బహిరంగ సత్యం.

  పూర్తిగా మెగా ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడ్డ జనసేనకు ఓట్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. దీంతో పవన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పాలిటిక్స్ కాదు.., ఇక క్యాస్ట్ పాలిటిక్స్ కు క్లాప్ కొట్టాలని పవర్ స్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధాంతాల పేరు చెప్తే సీఎం సీటు అందదని భావించారో ఏమో ఇక తాను కూడా పక్కా ట్రెడిషనల్ పొలిటీషియన్ గా మారాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: జగన్ గారూ ఆ పథకం పెట్టండి... కోర్టుకు వెళ్లే పని ఉండదు.. వైసీపీ ఎంపీ సెటైర్లు
  కాపులే కీలకం
  ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కులం కాపులే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు. ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ భీమవరం, గాజువాకలో పవన్ ఓటమి. దీనికి కారణం కూడా లేకపోలేదు తాను కుల రాజకీయాలు చేయనని.., కులాలు, మాతాలకు తాను అతీతుడినని పవన్ ప్రకటించడంతో కాపులు పవన్ ను తమవాడిగా భావించలేదనే చర్చలు సాగాయి.

  ఇది చదవండి: ‘పంచాయతీ’ల్లో వేలం పాటలు.., భలే మంచి పొలిటికల్ బేరము..


  కొత్త వ్యూహం
  దీంతో ఇప్పుడు పవన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. త్వరలో కాపు సంక్షేమ సేనతో పవన్ కల్యాణ్ భేటీ అవుతానని ప్రకటించడంతో పవన్ కాపులను తనవైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన కాపు సంక్షేమ సేనతో తాను సమావేశమవుతున్నట్లు పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు. ఈ మీటింగ్ లో కాపు రిజర్వేషన్, కాపుల సమస్యలు, వారి కోసం కేటాయించిన నిధులపై చర్చిస్తామన్నారు. ఈ ఒక్క ప్రకటనతో కాపులంతా పవన్ గురించి ఆలోచించచడం మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. కాపులను దగ్గర చేసుకునేందుకే పవన్ ఈ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: సీఎం జగన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నారా..? అక్కడ నవరత్నాలు... ఇక్కడ పంచ సూత్రాలు


  బీజేపీదీ అదే దారి
  అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అవడం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి గాలం వేయడంతో బీజేపీ-జనసేన కాపులను టార్గెట్ చేసినట్లు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం స్ట్రాటజీని అమలు చేయకపోతే కష్టమని రెండు పార్టీలు డిసైడయ్యాయట. అందుకే ఇటు పవన్, అటు సోము తమ సొంత సామాజికవర్గ మద్దతను కూడగట్టేందుకు ట్రై చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
  Published by:Purna Chandra
  First published: