Pawan Kalyan | వినాయకచవితి, చిరు బర్త్ డే నుంచి పవన్ కళ్యాణ్ కొత్త ఉద్యమం

Pawan Kalyan on Atmanirbhar Bharat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కోసం బీజేపీ, జనసేన కలసి పనిచేయనున్నాయి.

news18-telugu
Updated: August 20, 2020, 8:20 PM IST
Pawan Kalyan | వినాయకచవితి, చిరు బర్త్ డే నుంచి పవన్ కళ్యాణ్ కొత్త ఉద్యమం
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
  • Share this:
Pawan Kalyan Latest News | వినాయకచవితి, మెగాస్టార్ చిరంజీవి బర్త్ కలిసి వచ్చిన ఆగస్టు 22న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త ఉద్యమం ప్రారంభించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్‌ ఆలోచనను వినాయక చవితి నుంచే ప్రారంభించనున్నామన్నారు. జనసేన, బీజేపీ కలసి సంయుక్తంగా దీన్ని చేపడతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశీయ ఉత్పత్తులను వాడడం, ప్రోత్సహించడం. దాని వల్ల మన ప్రజలకు ఉపాధి లభిస్తుంది. దేశ జీడీపీకి దోహదపడుతుంది. జనసేన, బీజేపీ కలసి ఈ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనను ఈ వినాయకచవితి నుంచే ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఈ వినాయకచవితి నుంచే ఎందుకు నిర్ణయించామంటే భారత్‌లో అందరూ ఏదైనా పని ప్రారంభించేముందు విఘ్నేశ్వరపూజించి పని మొదలు పెడతారు. మన పండుగల్లో విదేశాల్లో తయారైన వస్తువులు, విగ్రహాలు వాడొద్దు. మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లాలో తయారైందా లేదా అనేది తెలుసుకోండి. దీని మీద ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో వినాయకచవితి నుంచే ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Chiranjeevi news, somu veerraju news, ap bjp, ap news, చిరంజీవి, సోము వీర్రాజు, ఏపీ బీజేపీ, ఏపీ న్యూస్
చిరంజీవి, సోము వీర్రాజు


ఏపీలో బీజేపీ, జనసేన కలసి పనిచేయాలని నిర్ణయించాయి. కొన్ని రోజుల క్రితం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజును నియమిస్తూ బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సోమువీర్రాజు, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలసి బీజేపీ అడుగు ముందుకు వేయాలని చిరంజీవి ఆకాంక్షించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, పవన్ కళ్యాణ్‌తో సమావేశంలో రాష్ట్ర రాజకీయాల గురించి సోము వీర్రాజు చర్చించారు.

ap bjp, pawan kalyan, janasena party, somu veerraju, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ, జనసేన
పవన్ కళ్యాణ్, సోమువీర్రాజు


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్ష చేయాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటాడని నమ్మకం. ఈ మధ్యలో నాలుగు నెలల కాలం ఉంటుంది. ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. ఈ నాలుగు నెలలు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. పీఠాధిపతులు, జీయర్లు వంటి వారు ఈ చాతుర్యాస్మ దీక్షను చేపడతారు. ఈ నాలుగు నెలలు వారు పొలిమేర దాటరు. వాళ్లే చేయాలనే నిబంధన లేదు. ఎవరైనా చేయవచ్చు. కానీ అందుకు కొన్ని నియమాలు ఉన్నారు. అరుణోదయవేళ స్నానం చేయాలి. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 20, 2020, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading