పవన్ కళ్యాణ్ తర్వాత టార్గెట్ ఇదే.. జేడీ లక్ష్మీనారాయణ నోటి వెంట...

జేడీ లక్ష్మీనారాయణ,పవన్ కల్యాణ్

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓడిపోలేదని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించామన్నారు.

  • Share this:
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత టార్గెట్ ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేనాని.. ఈ సారి సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో జేడీ లక్ష్మీనారాయణ బయటపెట్టారు. గత ఎన్నికల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన తరఫున పోటీచేసిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గత ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ జీవీఎంసీ మీద జనసేన జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ‘త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. జీవీఎంసీ మీద జనసేన జెండా ఎగరేయాలి. స్థానిక ఎన్నికల్లో జనసేనను గెలిపించుకోవాలి. పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించాలి. అందరం కలుద్దాం. ఒక్కొక్కరు పది, వందమందిని ప్రభావితం చేసి జనసేన సిద్ధాంతాలు, విధివిధానాలను వారిలోకి తీసుకెళ్దాం.’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓడిపోలేదని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించామన్నారు. రాబోయే కాలం జనసేనదేనన్న జేడీ.. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ దిగ్విజయంగా నిర్వహించామంటూ పవన్ కళ్యాణ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘జనసేన లాంగ్ మార్చ్ చూసి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ వారికి డౌట్ వచ్చిందట. సముద్రం గతి తప్పి రోడ్డుమీదకు వచ్చిందా అని అనుకున్నారట. జనసైన్యం అంటే ఏపీకే కాదు. దేశం మొత్తానికి చూపించాం.’ అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: