జనసేన కొత్త టీమ్ ఇదే.. నాగబాబుకు కీలక బాధ్యతలు

2024 ఎన్నికల కోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

news18-telugu
Updated: July 26, 2019, 6:08 PM IST
జనసేన కొత్త టీమ్ ఇదే.. నాగబాబుకు కీలక బాధ్యతలు
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 26, 2019, 6:08 PM IST
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని కూడగట్టుకున్న జనసేన.. మళ్లీ గాడిన పడే పని మొదలు పెట్టింది. 2024 ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీలను నియమించింది. నలుగురు సభ్యులతో జనసేన పొలిట్ బ్యూరో, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరాన్ని నియమించారు.

జనసేన పోలిట్ బ్యూరో

1. నాదెండ్ల మనోహర్

2. పి.రామ్మోహన్ రావు


3. రాజు రవితేజ్
4. అర్హంఖాన్

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ
Loading...
ఛైర్మన్: నాదెండ్ల మనోహర్

సభ్యులు

1.తోట చంద్రశేఖర్
2.రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు)
3. కొణిదెల నాగబాబు
4. కందుల దుర్గేష్
5. కోన తాతారావు
6. ముత్తా శశిధర్
7. పాలవలస యశస్విని
8. డా.పసుపులేటి హరిప్రసాద్
9. మనుక్రాంత్ రెడ్డి
10. ఎ.భరత్ భూషణ్
11. బి.నాయకర్

క్రమశిక్షణ సంఘం చైర్మన్: మాదాసు గంగాధరం

2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగారు. అయితే, పార్టీ పెట్టి ఐదేళ్లు గడిచినా కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్. ఆ ప్రభావం గత ఎన్నికల్లో కనిపించింది. సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాని నిర్నయించారు. దీంతో తొలుత పార్టీలో కమిటీలను నియమిస్తున్నారు.

జనసేన పార్టీ ఆలోచన దృక్పథానికి అనుగుణంగా... పార్టీ సిద్ధాంతాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని బలంగా క్షేత్రస్థాయి వరకూ తీసుకువెళ్లే సమర్థత ఉన్నవారిని పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎంపిక చేశారు. వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ వ్యూహాలను ప్రభావశీలంగా అన్ని స్థాయిల్లో అమలు చేయగలిగేవారికి ఇందులో స్థానమిచ్చారు. జనసేన బలోపేతం కోసం పవన్ కళ్యాన్ త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పర్యటన ద్వారా పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు, వారిని సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో ఉత్తేజితం చేసి దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు జనసేన పార్టీ పక్షాన తీసుకురానున్న మ్యాగజైన్ కు సంబంధించిన పనులు చురుగ్గా నడుస్తున్నాయి. సామాజిక, రాజకీయ పత్రికగా ఇది రూపుదిద్దుకుంటుంది.
First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...