తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తరువాత పవన్ తో పొత్తు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదని కేంద్ర పెద్దలకు నివేదిక అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కు బై బై చెప్పాలా..? కొనసాగించాలా అన్నదానిపై ఇప్పటికే చర్చ ప్రారంభమైనట్టు సమాచారం. ఒక వేళ పొత్తు కొనసాగితే పవన్ లేదా జనసేన నుంచి ఒకరి కేంద్ర మంత్రి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. లేదు పవన్ ను వద్దు అనుకుంటే.. వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవడమే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
AP High Court | రాజధాని తరలింపునకు సంబంధించి రాజకీయ పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఈనెల 27న ఆదేశాలు జారీ చేసింది.
Pawan Kalyan on Amaravati | అమరావతికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అమరావతిపై కొందరు నాయకులు ప్రతిపక్షంలో ఒకమాట చెప్పి, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని ఆరోపిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, రాజకీయ పార్టీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై జనసేన పార్టీ జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ‘రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన మొదటి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వాన్ని విశ్వసించి 28వేల మంది రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు. ఇప్పటికే ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు. పర్యావరణహితమైన రాజధాని జరగాలని చెబుతూనే ఉన్నాం. రాజధాని తరలింపునకు సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తాం. కేసులో తుది వరకు బాధ్యతగా నిలబడతాం. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నాం. న్యాయనిపుణుల సలహాలు, సహకారంతో గడువు లోగా కౌంటర్ వేస్తాం.’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అసలు ఏం జరిగింది?
రాజధాని తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేసిందని ఆరోపిస్తూ కొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడిన వారు, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట మారుస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సీఎంతోపాటు మంత్రివర్గం, రాజకీయపార్టీలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ పార్టీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజధాని తరలింపు సహా ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది. రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 27న హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.