జనసేన కొత్త అధికార ప్రతినిధులు వీరే...

Janasena Spokes persons | ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నియమించారు.

news18-telugu
Updated: September 13, 2019, 10:44 PM IST
జనసేన కొత్త అధికార ప్రతినిధులు వీరే...
పవన్ కల్యాణ్ (Source: Twitter)
news18-telugu
Updated: September 13, 2019, 10:44 PM IST
జనసేన పార్టీ అధికార ప్రతినిధులను నియమించింది. ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, బొలిశెట్టి సత్య, టి.శివశంకర్ వ్యవహరిస్తారు. స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులుగా పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్ రెడ్డి, అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), పి.గౌతమ్ కుమార్, కూనంపూడి శ్రీనివాస్‌లను ఎంపిక చేశారు. అధికార ప్రతినిధుల్లో కూనంపూడి మినహా మిగిలిన నలుగురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేశారు. కొత్తగా నియమితులైన అధికార ప్రతినిధులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. పార్టీలో అందరూ ఒకే మాట మీద ముందుకు వెళ్లాలని, భిన్నాభిప్రాయాలు వద్దని పవన్ కళ్యాణ్ వారికి సూచించారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...