నేలపై ఉల్లిపాయలు ఏరిన పవన్ కల్యాణ్

తిరుపతి రైతు బజార్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్ ఉల్లి ధరలపై ఆరా తీశారు.

news18-telugu
Updated: December 3, 2019, 3:04 PM IST
నేలపై ఉల్లిపాయలు ఏరిన పవన్ కల్యాణ్
రైతు బజార్‌లో పవన్ కల్యాణ్
  • Share this:
తిరుపతిలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన  రైతు బజార్‌కు వెళ్లారు. ఉల్లి ధరలపై ఆరా తీశారు. పవన్ అక్కడకు చేరుకోగానే భారీ ఎత్తున జనం, అభిమానులు, మీడియా కూడా వచ్చారు. ఈ తోపులాటలో కొందరు ఉల్లిపాయలు కాళ్ల కింద తొక్కుతూ పైపైకి వచ్చారు.దీంతో పవన్ అక్కడున్నవారినందరిని మందలించారు. దయ చేసి ఉల్లిని తొక్కదంటూ విన్నవించారు. స్వయంగా ఆయనే వంగి నేలపై చెల్లా చెదురుగా పడిపోయిన ఉల్లిపాయల్ని ఏరి పైకి వేశారు. ఈ సందర్భంగా ఉల్లి ధరలపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. కర్నూలులో ఉల్లి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయన్నారు. ప్రభుత్వాల వైఫల్యం వల్లే ధరలు ఇంత ఎక్కువగా పెరిగాయన్నారు పవన్ కల్యాణ్.  ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు పవన్‌కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. పెరిగిన ఉల్లి ధరలతో మధ్యవర్తులే లాభపడుతున్నారని... రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. ఉల్లి కోసం ప్రజలు రోజంతా వేచిచూసే పరిస్థితి రావడం దారుణమన్నారు.Published by: Sulthana Begum Shaik
First published: December 3, 2019, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading