జగన్‌కు ఝలక్... పవన్ కల్యాణ్ మామూలుగా ఇవ్వలేదుగా

కానీ అధికార పార్టీకి చెందిన లీడర్లు వెనక తిరిగేవాళ్లకే ఉద్యోగాలు దక్కాయని విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.

news18-telugu
Updated: September 22, 2019, 10:01 AM IST
జగన్‌కు ఝలక్... పవన్ కల్యాణ్ మామూలుగా ఇవ్వలేదుగా
పవన్ కళ్యాణ్ (Image:Janasena Party/Twitter)
  • Share this:
గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ... ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు దాడి చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి జగన్‌పై సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆరోపణలు గుప్పించారు. పారదర్శకత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని.. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జనసేనాని.దీంతో పాటు గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణపై కూడా పవన్ మండిపడ్డారు. ఎన్నో ఆశలతో ఉద్యోగం సంపాదించాలని లక్షలమంది గ్రామ సచివాలయ పరీక్షలు రాశారన్నారు. కానీ అధికార పార్టీకి చెందిన లీడర్లు వెనక తిరిగేవాళ్లకే ఉద్యోగాలు దక్కాయని విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం చాలా ఆందోళనకు గురి చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.

జనసేన పార్టీ కూడా గ్రామ సచివాలయ పరీక్షా పేపర్ లీకేజ్‌పై మండిపడింది. ‘పారదర్శకతతో, నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించాం అని డైలాగులు చెప్పి భారీ కుంభకోణానికి తెర లేపిన జగన్ ప్రభుత్వం’ అంటూ జనసేన పార్టీ తన ట్వీట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. మరోవైపు జగన్ ప్రభుత్వం కూడా దీనిపై ఒక్కమాట కూడా మాట్లాడటకపోవడంతో ప్రతిపక్షలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి.First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు