మంగళగిరిలో పర్యటించనున్న పవన్.. భవన నిర్మాణ కార్మికులకు..

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ ఈ నెల 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. రెండు వారాల్లోపు భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు ఇవ్వాలని.. చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆ సందర్భంగా డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: November 13, 2019, 6:20 PM IST
మంగళగిరిలో పర్యటించనున్న పవన్.. భవన నిర్మాణ కార్మికులకు..
పవన్ కల్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15న (శుక్రవారం) మంగళగిరిలో పర్యటించనున్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదాన పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇసుక కొరత కారణంగా ఏపీలో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు రోడ్డన పడ్డాయని కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు పవన్. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలయిందని.. పని లేక కార్మికులంతా పస్తుంలుంటున్నారని జగన్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదానపథకాన్ని ప్రారంభిస్తున్నారు జనసేనాని.

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ ఈ నెల 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. రెండు వారాల్లోపు భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు ఇవ్వాలని.. చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే అమరాతి వీధుల్లో నడిచి.. నిరసన వ్యక్తం చేస్తానని స్పష్టం చేశారు పవన్. తనను ఎవరు ఆపుతారో చూస్తానని..ఎంత మంది పోలీసులను పెట్టుకుంటారో చూద్దామని అన్నారు. ఐతే ఆయన డిమాండ్‌పై ఇప్పటి వరకూ స్పందించలేదు జగన్ ప్రభుత్వం.




First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...