news18-telugu
Updated: January 21, 2020, 1:41 PM IST
పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో... ఇరు పార్టీల సమన్వయం సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. అమరావతిపై ఏ రకంగా ఉద్యమించాలనే దానిపై ఇరు పార్టీలు కలిసి కార్యాచారణ రూపొందించనున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. జనసేనతో కలిసి అమరావతిపై పోరాటానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తామని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి అమరావతిపై ఎలాంటి పోరాటం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
Published by:
Kishore Akkaladevi
First published:
January 21, 2020, 1:41 PM IST