జనసేన బర్త్ డే వేళ... కొత్త పనికి పవన్ కళ్యాణ్ శ్రీకారం...

Janasena 6th Formation Day | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రేపటికి(మార్చి 14) ఆరు సంవత్సరాలు కానుంది.

news18-telugu
Updated: March 13, 2020, 8:18 PM IST
జనసేన బర్త్ డే వేళ... కొత్త పనికి పవన్ కళ్యాణ్ శ్రీకారం...
పవన్ కళ్యాణ్ (Twitter/Pjhoto)
  • Share this:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రేపటికి(మార్చి 14) ఆరు సంవత్సరాలు కానుంది. ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అయితే, ఈ సారి వేడుకలకు రాజమహేంద్రవరం వేదిక కానుంది. ‘ఈనెల 14న జనసేన పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని రామపాదాల రేవులో పవన్ కళ్యాణ్ గోదావరి నదికి హారతి ఇచ్చి ‘మన నుడి - మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని, వీలును బట్టి నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి.హరిప్రసాద్ పిలుపునిచ్చారు.



2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీని లాంచ్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీతో కలసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది. అయితే, టీడీపీ, బీజేపీ పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయకుండా ఉండిపోయింది. అయితే, 2014 - 19 మధ్య రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తాజాగా విజన్ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్ చేశాయి.
First published: March 13, 2020, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading