నేడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ... నెక్ట్స్ ఏంటి?

బీజేపీ సహకారంతో... రాజధాని తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్... నడ్డాతో ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

news18-telugu
Updated: January 23, 2020, 6:13 AM IST
నేడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ... నెక్ట్స్ ఏంటి?
పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణ
  • Share this:
ఏపీ రాజకీయాలతో ఢిల్లీ హీటెక్కుతోంది. ఓవైపు ప్రభుత్వం రాజధాని తరలింపు కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటుంటే... ఎట్టి పరిస్థితుల్లో తరలింపును ఆపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ మద్దతుతో... రాష్ట్రంలో రాజధాని తరలింపును అడ్డుకోవాలని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా... సమైక్యంగా పోరాడేందుకు అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ - జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాన్, కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహన్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి వంటి నేతలు చర్చించారు. తర్వాత వారు ఈ అంశాలను మీడియాకు వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఓసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 28న మరోసారి తాము భేటీ అవుతామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఇకపై ధర్నాలు, ఆందోళనలు ఏం చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ గురించి జేపీ నడ్డాకు తాము తెలియజేస్తామన్నారు. జనసేన పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాము కేవలం బీజేపీతో పొత్తుమాత్రమే పెట్టుకున్నామన్నారు.
Published by: Krishna Kumar N
First published: January 23, 2020, 5:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading