వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి... పవన్ కళ్యాణ్ నిర్ణయం ?

పవన్ కళ్యాణ్ కంటే ముందు ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో సమావేశమైన వంగవీటి రాధా... పార్టీలో తనకు ఇవ్వబోయే బాధ్యతలు, పదవులపై ఆయనతో చర్చించినట్టు సమాచారం.

news18-telugu
Updated: September 6, 2019, 12:03 PM IST
వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి... పవన్ కళ్యాణ్ నిర్ణయం ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా... జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చలు జరిపిన వంగవీటి రాధా... త్వరలోనే అధికారికంగా పార్టీ మారనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం... ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం... వంగవీటి రాధా అంచనాలను తారుమారు చేశాయి. ఎన్నికల తరువాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రాధా... అప్పట్లోనే పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపారు. దీంతో ఆయన గతంలోనే జనసేనలోకి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే పార్టీ మార్పుకి సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని భావించిన రాధా... ఎట్టకేలకు జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కంటే ముందు ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో సమావేశమైన వంగవీటి రాధా... పార్టీలోకి తనకు ఇవ్వబోయే బాధ్యతలు, పదవులపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. జనసేనలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనే అంశంపై ముందుగానే ఆ పార్టీ ముఖ్యనేత నుంచి రాధా క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు లేదా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఏదో ఒక పదవిని వంగవీటి రాధాకు పార్టీ ఆఫర్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాధా పార్టీలో చేరిన రోజే దీనిపై పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారని సమాచారం. మొత్తానికి జనసేనలో చేరనున్న వంగవీటికి రాధాకు... పార్టీలో కీలక బాధ్యతలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 6, 2019, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading