news18-telugu
Updated: June 13, 2020, 4:20 PM IST
వెంకటేష్‌తో కలిసి ఈ సినిమాలో నటించాలనుకుంటున్నాడు పవర్ స్టార్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ స్థలాన్ని వేలం నుంచి మినహాయిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, గుంటూరు మార్కెట్ యార్డు స్థలాన్ని విక్రయించుకూడదంటూ పోరాటం చేసిన జనసేన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ‘గుంటూరులో ఒక ల్యాండ్ మార్క్ లాంటి పీవీకే నాయుడు మార్కెట్ స్థలాన్ని ప్రజా ఆస్తుల వేలం జాబితా నుంచి తప్పించేందుకు చేసిన పోరాటం ఫలితాన్ని ఇవ్వడం సంతోషదాయకం. దశాబ్దాలుగా ఉన్న ఈ మార్కెట్‌ను అమ్మేస్తారు అనగానే గుంటూరు ప్రజల్లో ఆందోళన నెలకొంది. జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలిచి 10 రోజుల పాటు నిరసన దీక్షలు చేసింది. ఆ మార్కెట్‌ను కాపాడేందుకు పోరాడింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ వేలం జాబితా నుంచి పీవీకే నాయుడు మార్కెట్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దీని కోసం పోరాడిన జనసేన నేతలు, కార్యకర్తలకు అభినందనలు.’అని పవన్ కళ్యాన్ ఓ ప్రకటన జారీ చేశారు.
మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పీవీకే నాయుడు మార్కెట్ కూడా ఒకటి. అయితే, ప్రజా ఆస్తులు అమ్ముకోవడం అంటే ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడమేనని పవన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు మార్కెట్ యార్డులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మిగిలిన వాటి విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలని, ప్రజా ఆస్తుల విక్రయం ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 13, 2020, 4:20 PM IST