చిరంజీవి ఫేమస్ సాంగ్.. పవన్ కళ్యాణ్ ట్వీట్.. జగన్‌పై సెటైర్

చిరంజీవి హీరోగా నటించిన రుద్రవీణ సినిమాలోని ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’ పాటను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

news18-telugu
Updated: November 6, 2019, 6:49 PM IST
చిరంజీవి ఫేమస్ సాంగ్.. పవన్ కళ్యాణ్ ట్వీట్.. జగన్‌పై సెటైర్
వైఎస్ జగన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల దాడి పెంచారు. ఇప్పటి వరకు మాటలతో విమర్శల దాడి చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి ట్విట్టర్ వేదికగా మరో సెటైర్ వేశారు. అయితే, సినిమా స్టైల్లో ఉండడం విశేషం. చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ సినిమాలో ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’ అనే పాటను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో జగన్ పాలనకు ఈ పాట అతికినట్టు సరిపోతుందన్నారు. వైసీపీ మేనిఫెస్టోను నమ్మి ఓటు వేసిన ప్రజలను జాగృతం చేసేందుకు ఈ పాట సరిగ్గా సరిపోతుందన్నారు.

దీంతోపాటు రుద్రవీణ సినిమాలో నుంచే మరో పాటను కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ‘చుట్టు పక్కల చూడరా చిన్నవాడా’ అనే పాటను కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఏపీలో వైసీపీ నేతలు నెల వచ్చేసరికి జీతాలు, భత్యాలు బాగానే తీసుకుంటున్నారని, రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తీశారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన రుద్రవీణ సినిమాను మెగాబ్రదర్ నాగబాబు నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com