HOME »NEWS »POLITICS »pawan kalyan target ap ysrcp government with liquor brands ak prn

Pawan Targets Jagan: సీఎం మెడల్, వైసీపీ మెడల్... వైసీపీ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

Pawan Targets Jagan: సీఎం మెడల్, వైసీపీ మెడల్... వైసీపీ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
పవన్ కళ్యాణ్, జగన్ (ఫైల్ ఫోటో)

Pawan Targets Jagan: 151 మంది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని’బంగారు ఆంధ్రా’గా అభివృద్ధి చేస్తుందనుకున్నాం గానీ గోల్డెన్ ఆంధ్ర పేరుతో మద్యం విక్రయిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

  • Share this:
    జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్ టార్గెట్ గా చేసుకోని విమర్శలు సంధిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మద్యం బ్రాండ్లనే ఉదాహరణగా చూపుతూ అధికారపార్టీని టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మద్యం షాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. తుఫాన్ దెబ్బకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న పవన్... మద్యం షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాట తప్పిందన్నారు. సీఎం జగన్ చెప్పిందొకటి చేసేదొకటన్నారు.

    అంతేకాదు ఒకడుగు ముందుకేసి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డెన్ ఆంధ్ర కాదని.. సీఎం మెడల్, వైసీపీ మెడల్ పేర్లతో కొత్త కొత్త బ్రాండ్లను విక్రయించి ఆ సొమ్ముతో రైతులను ఆదుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని’బంగారు ఆంధ్రా’గా అభివృద్ధి చేస్తుందనుకున్నాం గానీ గోల్డెన్ ఆంధ్ర పేరుతో మద్యం విక్రయిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ ఓకేగానీ.. ఈ బంగారు ఆంధ్రా బాటిల్స్ అమ్ముతారని ఊహించలేదన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.16వేల కోట్ల ఆదాయంతో రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగుతామన్నారు.



    వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నెల్లూరు, కడప జిల్లాల్లో వేలాది ఇళ్లు నీటమునిగాయన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూడా విమర్శలకే పరమితం చేశారు తప్ప వేరే ప్రయోజనం లేదన్నారు. తొలిరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా పవన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోయ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టమేమైనా వైసీపీ జాగీరా.. అని నిలదీసిన పవన్ ఎక్కడికైనా వస్తామని ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు.

    నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించే క్రమంలో తొలి రోజు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్.. తర్వాత రెండు రోజులు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.35వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో జై కిసాన్ పేరుతో రైతుల కోసం ఉద్యమం చేపడతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

    ఇక తిరుపతి అభ్యర్థిపై సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పోలవరం, అమరావతి, రైతుల సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తమని పవన్ స్పష్టం చేశారు. తిరుపతి విషయంలో కార్యకర్తలు, స్థానిక నేతల అభిప్రాయం మేరకే ముందుకెళ్తామన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:December 05, 2020, 15:40 IST

    टॉप स्टोरीज