పవన్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్...

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్త మాటలను పవన్ కళ్యాణ్ సమర్థించారు.

news18-telugu
Updated: December 5, 2019, 5:02 PM IST
పవన్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్...
పవన్ కళ్యాణ్
  • Share this:
అనంతపురం జిల్లా సాకే పవన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంతో ఆవేదన చెందాడు కాబట్టే సాకే పవన్ ఆ మాట అన్నాడని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నోసార్లు రాప్తాడులో సాకే పవన్‌ను బెదిరించారని ఆయన వ్యాఖ్యానించారు. తలలు తీస్తానంటే కేసులు పెడతారా ? అని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబును ఉరి తీయాలని జగన్ అన్నారని... అప్పుడు ఆయనపై ఏ కేసు పెట్టారని పవన్ వ్యాఖ్యానించారు. గతంలో జగన్‌పై ఏ కేసు పెట్టారో సాకే పవన్‌పై అదే కేసు పెట్టాలని అన్నారు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇది ఫ్యాక్షన్ సీమ కాదని.. సింహాల సీమ అని అన్నారు. వైసీపీ నేతలు దాడికి దిగితే... తాము కూడా ఎదురుదాడి చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

అంతకుముందు మదనపల్లె జనసేన సమావేశంలో అనంతపురం జిల్లా నేత సాకే పవన్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత పవన్ కల్యాణ్ సై అంటే వైసీపీ వారి తలలు నరుకుతానంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా నాయకులు, కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు పవన్ గురువారం మదనపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, అఘాయిత్యాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయినా వారి బెదిరింపులకు భయపడమన్నారు. ప్రభుత్వం జిల్లాలో ఎటువంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విజయసాయిరెడ్డి అతిగా మాట్లాడుతున్నారని, తీరు మార్చుకోవాలని సూచించారు.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>