సీఏఏకు పవన్ కళ్యాణ్ మద్దతు... వారికి నష్టంలేదని వివరణ

ఇండియా, పాకిస్థాన్ విడిపోయే సమయంలో చేసుకున్న ఒప్పందాలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని... ఆ దేశంలో హిందూవులకు సరైన రక్షణ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: January 16, 2020, 4:01 PM IST
సీఏఏకు పవన్ కళ్యాణ్ మద్దతు... వారికి నష్టంలేదని వివరణ
పవన్ కళ్యాణ్
  • Share this:
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ(పౌరసత్వ సవరణ బిల్లు)‌కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ బిల్లు కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న హిందూ మైనార్టీలకు మేలు జరుగుతుందన్న పవన్ కళ్యాణ్... మన దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన వివరించారు. దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇండియా, పాకిస్థాన్ విడిపోయే సమయంలో చేసుకున్న ఒప్పందాలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని... ఆ దేశంలో హిందూవులకు సరైన రక్షణ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పాకిస్థాన్‌లో క్రికెటర్‌గా కొనసాగిన వ్యక్తి విషయంలోనే ఇలాంటి వివక్ష ఉందనే విషయం ఇటీవల పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలతో తేలిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని తెలిపారు.
First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>