జగన్ ఎఫెక్ట్... బీజేపీకి పవన్ కళ్యాణ్ కటీఫ్ ?

జనసేన, బీజేపీ మధ్య పొత్తు బంధానికి ఆదిలోనే బీటలు వారాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 15, 2020, 12:19 PM IST
జగన్ ఎఫెక్ట్... బీజేపీకి పవన్ కళ్యాణ్ కటీఫ్ ?
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్, బీజేపీ కలవడంతో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని అంతా అనుకున్నారు. ఇకపై ఏపీలో ఏ రకమైన రాజకీయ కార్యాచరణ చేపట్టినా... బీజేపీ, జనసేన కలిసే చేపడతామని ఇరు పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. రెండు పార్టీలు కలిసి విజయవాడలో అమరావతి కోసం లాంగ్ మార్చ్ చేపడతామని ప్రకటించారు. కానీ అంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... ఆ లాంగ్ మార్చ్ వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటించి అత్యాచార బాధితురాలి కోసం గళం వినిపించారు. పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనలో బీజేపీ శ్రేణులు ఎక్కడా కనిపించలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో జనసేనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా పాల్గొంటాయా ? లేదా ? అన్నది సందేహంగా మారింది. అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందా ? లేదా ? అనే సందేహాలు మొదలయ్యాయి. జనసేన, బీజేపీ మధ్య పొత్తు బంధానికి ఆదిలోనే బీటలు వారాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు బీజేపీని పవన్ కళ్యాణ్ కావాలనే దూరంగా పెడుతున్నారేమో అనే టాక్ కూడా చక్కర్లు కొడుతోంది.

కొంతకాలంగా ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ, కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడం పవన్ కళ్యాణ్‌కు అంతగా నచ్చడం లేదని... ఈ కారణంగానే ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరంగా జరగడానికి ఓ కారణం కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మొన్నీమధ్యే బీజేపీతో దోస్తీ చేసిన పవన్ కళ్యాణ్... అంతలోనే ఆ పార్టీకి దూరం జరుగుతున్నట్టు కనిపించడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు