‘చంద్రబాబు పార్ట్‌నర్’ వ్యాఖ్యలపై వైఎస్ జగన్‌కు పవన్ కళ్యాణ్ ఘాటు రిప్లై

‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైకిల్ చైన్ తెంచేశారు. ఫ్యాన్ వేద్దామంటే ‘పవర్’ జనసేన దగ్గర ఉంది. గాజు గ్లాస్ మాత్రమే దూసుకుపోతుంది’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 2:40 PM IST
‘చంద్రబాబు పార్ట్‌నర్’ వ్యాఖ్యలపై వైఎస్ జగన్‌కు పవన్ కళ్యాణ్ ఘాటు రిప్లై
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
  • Share this:
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పార్ట్‌నర్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్, చంద్రబాబు పార్ట్‌నర్స్ అంటూ వైసీపీ నాయకులు తిడుతున్నారు. నేను వాళ్లందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. నేను పొలిటికల్ పార్టీలకు పార్ట్‌నర్ కాదు. ప్రజలకు పార్ట్‌నర్. తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీకి సపోర్ట్ చేయాలంటే మగాడిలా సపోర్ట్ చేస్తా. 2014లో సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను. చేశాను. 2019లో టీడీపీతో పొత్తులేదని చెప్పాను. బీఎస్పీ, వామపక్షాలతో కలసి ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్ మోహన్ రెడ్డిలా చీకట్లో ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుని తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టుపెట్టను.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ అండ చూసుకుని వైసీపీ నాయకులు ముస్లింల మీద దాడులు చేస్తూ ఊరుకోబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.



తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతిలో కూరకుపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద పట్టుకోల్పోయారన్నారు. వైసీపీని ఎదుర్కోవడం కేవలం జనసేన వల్లే అవుతుందన్నారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైకిల్ చైన్ తెంచేశారు. ఫ్యాన్ వేద్దామంటే ‘పవర్’ జనసేన దగ్గర ఉంది. గాజు గ్లాస్ మాత్రమే దూసుకుపోతుంది’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
First published: March 28, 2019, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading