శబరిమలకు నేనెందుకు వెళ్లకూడదు... ప్రశ్నించిన పవన్ కల్యాణ్ భార్య

‘నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?" అని ఆమెను ప్రశ్నించారు పవన్.

news18-telugu
Updated: December 4, 2019, 10:55 AM IST
శబరిమలకు నేనెందుకు వెళ్లకూడదు... ప్రశ్నించిన పవన్ కల్యాణ్ భార్య
మూడో భార్య అన్నా లెజ్‌నోవాతో పవన్ కళ్యాణ్
  • Share this:
ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. తిరుపతిలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన వేళ మధ్యలో శబరిమలలో మహిళల ప్రవేశం గురించిన ప్రస్తావన వచ్చిన వేళ, ఒక్కో మతానికి ఒక్కో ధర్మం ఉంటుందని, దాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు. శబరిమల గురించి తన భార్య అన్నా లెజినోవో తనను ప్రశ్నించిందని గుర్తు చేసుకున్నారు. శబరిమలకు తానెందుకు వెళ్లరాదని ఆమె తనను అడిగిందన్నారు పవన్. దానికి ‘నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?" అని అడిగానన్నారు. దానికి సమాధానంగా లెెజినోవా అది తమ సంప్రదాయమని చెప్పిందన్నారు.

మీకు మీ సంప్రదాయం లాగానే... ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని తాను బదులిచ్చానన్నారు. అయ్యప్పస్వామి బ్రహ్మచారని, అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని తన భార్యకు  వివరించానన్నారు పవన్ కల్యాణ్. రెచ్చగొట్టాలని చూస్తున్న కొందరు మాత్రమే శబరిమలపై కోర్టును ఆశ్రయించారని, ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని తెలిపారు పవన్.
First published: December 4, 2019, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading