జనసేన ట్విట్టర్ ఖాతాలు బ్లాక్... పవన్ కల్యాణ్ సీరియస్

పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ఖాతాల్ని ట్విట్టర్ బ్లాక్ చేసింది.

news18-telugu
Updated: September 18, 2019, 2:28 PM IST
జనసేన ట్విట్టర్ ఖాతాలు బ్లాక్... పవన్ కల్యాణ్ సీరియస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
  • Share this:
పవన్ కల్యాణ్‌కు బయట ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం పవన్ పెట్టే ట్వీట్ల కోసం ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు కూడా మద్దతు దార్లు, అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను సస్పెండ్ చేసింది ట్విట్టర్.

జనసేనకు ట్విట్టర్ షాక్ ఇవ్వడంతో పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన మద్దతుదారులకు సంబంధించి 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదన్నారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అని ట్విట్టర్ యాజమాన్యాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే బ్లాక్ చేసిన తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పునరుద్ధరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌ను  డిమాండ్ చేశారు.


First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading