ఆ ఒక్కటే 2019లో కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తుంది: పవన్ కళ్యాణ్

Janasena Meeting | తన ధైర్యమే 2019 ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్ కొడుకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: March 14, 2019, 9:59 PM IST
ఆ ఒక్కటే 2019లో కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తుంది: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్
  • Share this:
తన ధైర్యమే 2019 ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్ కొడుకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన ధైర్యమే తనకు ఎప్పుడూ వెన్నంటి ఉందన్నారు. అందుకే తాను ఇంటర్‌తో చదువు మానేసినా తాను పైకి ఎదిగానన్నారు. ఆ ధైర్యమే 2014 మార్చిలో తనను జనసేన పార్టీ పెట్టేలా ప్రోత్సహించిందన్నారు. ఆ ధైర్యమే 2014 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించిందన్నారు. ఆ ధైర్యమే 2019 ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్ కొడుకును ముఖ్యమంత్రిని చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఐదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారని, అలాంటివన్నీ మార్చాలన్న ఉద్దేశంతోనే తాను పార్టీ పెట్టానని చెప్పారు.తాను అడుగుపెడితే తల తెగిపడినా వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టే తాను ఇక్కడ ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

తన వెనుక ఉన్న వారంతా కుర్రాళ్లు.. వాళ్లేం చేస్తారని అనుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తన వెనుక టీవీ ఛానళ్లు, పేపర్లు లేవని అన్నారు. ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో వచ్చారని, జీవితాన్ని మొత్తం చూశారన్నారు. అయితే, తాను మాత్రం సూపర్ స్టార్‌డమ్ ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజలకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికే తాను తన భవిష్యత్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు తన వద్దకు వచ్చి ‘చంద్రబాబుతో చెప్పి ఓ మంచి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు తీసుకోండి. బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు.’ అని చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, తాను ఇవ్వడానికే రాజకీయాల్లోకి వచ్చా కానీ, తీసుకోవడానికి రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాన్ బలం గోదావరి జిల్లాలు అంటున్నారు. కాదు. జనసేన బలం సమస్త ఆంధ్రప్రదేశ్. నేను ఒక కులం, మతం ప్రాంతానికి పరిమితం కాదు. కోస్తా నాది. రాయలసీమ నాది. రాయలసీమ అంటే బాంబులు వేసిన నేల కాదు. చదువుల తల్లి నేల. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ లాంటి వారు నడయాడిన నేల.
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత


జనసేన అధికారంలోకి వస్తే సాగు సాయం కింద ఒక్కో రైతుకు ఎకరానికి రూ.8000 సాయం అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే దాన్ని రూ.10,000 చేస్తామన్నారు.

రాజమహేంద్రవరంలో జనసేన బహిరంగసభలో పవన్ కళ్యాన్ స్పీచ్
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading