పారిశ్రాకవాడలో వరుస ప్రమాదాలు విశాఖ వాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పరవాడలోని సాల్వెంట్ పరిశ్రమలో భారీ పేలుడు జరగడంతో స్థానికులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సాల్వెంట్ కర్మాగారంలో పేలుడు జరగడం దురదృష్టకరమని ఓ ప్రకటనలో తెలిపారు. గాజువాక, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని ఆయన. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ఫార్మా ఘటనలు మరువక ముందే విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసిందని తెలిపారు.
ఆందోళన కలిగిస్తున్న విశాఖ ప్రమాదాలు - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/KBVfThtof6
— JanaSena Party (@JanaSenaParty) July 14, 2020
విశాఖ రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్ కంపెనీలో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు (40) చనిపోయారు. శిథిలాల మధ్య ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్ (33) గాజువాకలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మరో ముగ్గురికి కొద్దికొద్దిగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలం దగ్గర 15 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని అంచనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan, Visakha, Vizag