పుట్టినరోజు ఓ మెసేజ్ వచ్చింది... పార్టీ ఫండ్‌పై పవన్ కల్యాణ్ రియాక్షన్

‘వాళ్లు ఇచ్చింది పదో, వందో, వెయ్యో నాకు తెలియదు కానీ... పార్టీ కోసం వాళ్లు పెట్టిన పెట్టుబడి ..ఇది మాది అని పెట్టిన పెట్టబడి అన్నారు’ పవన్ కల్యాణ్.

news18-telugu
Updated: September 7, 2019, 12:50 PM IST
పుట్టినరోజు ఓ మెసేజ్ వచ్చింది... పార్టీ ఫండ్‌పై పవన్ కల్యాణ్ రియాక్షన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్
news18-telugu
Updated: September 7, 2019, 12:50 PM IST
ఇటీవల సెప్టెంబర్ 2వ తేదీని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు కొందరు పవన్ స్థాపించిన జనసేన పార్టీకి తోచినంత విరాళాలు కూడా అందించారు. తాజగా పార్టీకి అభిమానులు ఇచ్చిన విరాళాలపై జనసేన అధినేత పవన్ స్పందించారు. పుట్టినరోజు తనకు ఒక మెసేజ్ వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. 33వేలపై చిలుకుమంది జనం... మూడుకోట్ల రూపాలయకు పైగా పార్టీ ఫండ్ పంపించారన్నారు. వాళ్లు ఇచ్చింది పదో వందో వెయ్యో నాకు తెలియదు కానీ... పార్టీ కోసం వాళ్లు పెట్టిన పెట్టుబడి ఇది మాది అని పెట్టిన పెట్టబడి అన్నారు పవన్ కల్యాణ్. ఆ మొత్తాన్ని నేను కొన్ని వేలకోట్లగా భావిస్తున్నానన్నారు. ఇదే పార్టీకి ఉన్న శక్తి అన్నారు. ఆ బలం కేవలం సినిమాల వల్ల వచ్చింది కాదన్నారు పవన్. వాళ్ల భావన జనసేన పార్టీలో ఉందన్నారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...