జనసేన పార్టీ ఆఫీసులు మూతపడ్డ వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్

ఈ వార్తలపై ఎలంటి ఆందోళనకు గురికావద్దని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు

news18-telugu
Updated: April 23, 2019, 4:56 PM IST
జనసేన పార్టీ ఆఫీసులు మూతపడ్డ వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. వీటికి సంబంధించన ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా పార్టీ ఆఫీసులు మూతపడ్డ వార్తలపై స్పందించారు. ఈ వార్తలపై ఎలంటి ఆందోళనకు గురికావద్దని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో యధావిధిగా జనసేన పార్టీ కార్యాలయాలు కొనసాగుతాయన్నారు పవన్ కల్యాణ్. ఇది ఆరంభం మాత్రమేననీ, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్.

ఏపీలో పోలింగ్ ముగిశాక..జనసేన సైలెంట్‌గా ఉంది. టీడీపీ, వైసీపీ తరహాలో ఏపీ రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థులతో సోమవారం పవన్ సమావేశమవడం తప్ప జనసేనలో ఎలాంటి కార్యకలాపాలు లేవు. అంతేకాదు ఎన్నిక‌లు ముగిసిన వారం రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో పార్టీ కార్యాల‌యాలు ఖాళీ చేయడం ఒక్క‌సారిగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.జనసేన పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హారించిన నేత‌లు సైతం ఒక్కొక్క‌రిగా పార్టీకి దూర‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా కొద్ది రోజుల ముందు విజ‌య‌బాబు పార్టీకి రాజీనామా చేస్తే.. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత అద్దేప‌ల్లి శ్రీధ‌ర్ పార్టీ వ్య‌వహారాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ గొంతుకను వినిపించిన ఆయనే పార్టీకి దూరంగా ఉండడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికే పార్టీ కార్యాలయాలకు టులెట్ బోర్డులు పెట్టడం..దీనికి తోడు నేతలు వరుసగా పార్టీని వీడుతుండడంతో కింది స్థాయి పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళంలో ఉన్నారు. దీంతో పవన్ ఈ వార్తలపై స్పందించారు. ఎవరు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు పవన్.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading