ఇకపై ఊరుకోం.. ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

వైసీపీ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చేతులు కట్టుకొని కూర్చోబోమని హెచ్చరించారు పవన్ కల్యాణ్. తమకు బలం ఉంది కాబట్టే భరిస్తున్నామని అన్నారు.


Updated: January 14, 2020, 5:22 PM IST
ఇకపై ఊరుకోం.. ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి పవన్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nadendla Manohar)
  • Share this:
ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు, కాకినాడ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ పార్టీ నేతలు అకారణంగా లేని గొడవను సృష్టించారని విమర్శించారు. మీరు బూతులు తిట్టి, దాడులు చేస్తే.. మా వారిపై కేసులు పెడతారా అంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చేతులు కట్టుకొని కూర్చోబోమని హెచ్చరించారు. తమకు బలం ఉంది కాబట్టే భరిస్తున్నామని అన్నారు.

బలం ఉన్న వాళ్లం కాబట్టే భరిస్తున్నాం. శాంతిభద్రత సమస్యలు సృష్టించాలనుకుంటే మీరెవ్వరూ ఇక్కడ ఉండరు. తెగించి రోడ్ల మీదకు వస్తాం. నా సంస్కారం, నా మాట నియంత్రణలో ఉన్నాయి. పోలీస్ శాఖ, ఉన్నతాధికారులు, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులకు చెబుతున్నా.. ఇంకొక్క సంఘటన మాపై జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోం. దాడులు చేసిన వారిపై కేసులు పెట్టాలి. కారకులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఘటన వీడియోలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం.
పవన్ కల్యాణ్


వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్య, ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా. ఇలాంటి భాషను గానీ, ప్రజా ప్రతినిధులను గానీ ఎప్పుడూ చూడలేదు. తుని ఘటన జరిగినప్పడు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కానీ మాపై ఇన్ని మాటలని, దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం క్షమించరానిది. రాజకీయ నేతను తిట్టనిప్పుడు గొడవ జరుగుతుందని పోలీసులకు తెలుసు. వాళ్లే సుమోటోగా తీసుకొని ఎమ్మెల్యేపై కేసుపెట్టాలి.
పవన్ కల్యాణ్

కాగా, కాకినాడలో ఈ నెల 12న తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. అనంతరం జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఆ ఘటనలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకే పవన్ కాకినాడకు వెళ్లారు.
First published: January 14, 2020, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading