Tirupati ByPolls: తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీపై స్పందించిన పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్

Janasena on Tirupati ByPolls: తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

 • Share this:
  తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాలేదని చెప్పారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలు సంయుక్త కమిటీ సూచనల మేరకే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల పెద్దలు కూర్చుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. గతంలో తిరుపతిలో ఓసారి గెలిచిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి గెలవాలని భావిస్తోంది. అయితే, సామాజికవర్గాల సమీకరణాలు, గతంలో చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన పరిస్థితులను బేరీజు వేసుకుని జనసేన పోటీకి కాలు దువ్వుతోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాన్ ఈ విషయంపై చర్చించేందుకు ఢిల్లీ కూడా వెళ్లారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నందుకు ప్రతిగా ఏపీలోని తిరుపతి లోక్ సభ సీటు తమకు ఇవ్వాలని కోరారు. అయితే, కేంద్రంలోని బీజేపీ అందుకు సుముఖంగా లేదు. ప్రస్తుతానికి దానిపై సంయుక్తంగా ఓ కమిటీ వేద్దామని మాత్రమే చెప్పినట్టు తెలిసింది. దీంతో పవన్ కళ్యాణ్ నిరాశగా తిరిగివచ్చారు.

  ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..

  విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

  నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం అని చెప్పారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు ‘జై కిసాన్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. పంట నష్టాల వల్ల నలుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు ఆగాలంటే వెంటనే ప్రభుత్వం రూ.10వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యలను విస్మరించడమే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమని పవన్ కళ్యాణ్ భావించారు.

  తూర్పుగోదావరి జిల్లాలో క్లాస్ రూమ్‌లో ఇంటర్ విద్యార్థులు పెళ్లి

  Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు 

  పంటలు నష్టపోయిన రైతుల కోసం ఏమైనా విరాళం ఇస్తున్నారా అని విలేకరులు ప్రశ్నకు పవన్ కళ్యాన్ స్పందించారు. తనతో పాటు వైసీపీ తరఫున గెలిచిన 151 మందిని కూడా అదే ప్రశ్న అడగాలన్నారు. తన వ్యక్తిగతంగా తనకు తోచినంత సాయం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నానని, రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు పెట్టి రాజ్యసభ ఎంపీ సీటు కొనుక్కునే వారు, రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఎమ్మెల్యే ఎన్నికలకు ఖర్చు పెట్టే వారు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలన్నారు. ప్రజల పన్నులతో నడుస్తున్న ప్రభుత్వం ముందుగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: