నన్ను తిట్టడం కాదు.. అనంతపురం కరువుపై పోరాడు: జగన్‌కు పవన్ కౌంటర్
వైసీపీ నాయకులు జనసేనను గుర్తించకున్నా ఫర్వాలేదని, సమస్యలను గుర్తిస్తే చాలని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉన్నది వైసీపీ గుర్తింపు కోసం కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అని గుర్తుచేశారు.
news18-telugu
Updated: December 6, 2018, 4:08 PM IST
news18-telugu
Updated: December 6, 2018, 4:08 PM IST
వైసీపీ అధినేత జగన్ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రతిపక్ష నేత తనను వ్యక్తిగతంగా దూషించడం మాని అనంతపురం కరువుపై పోరాటం చేయాలని సూచించారు. అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని సలహా ఇచ్చారు. గురువారం అనంతపురం కరువు, వలసలపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించారు.
వైసీపీ నాయకులు జనసేనను గుర్తించకున్నా ఫర్వాలేదని, సమస్యలను గుర్తిస్తే చాలని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉన్నది వైసీపీ గుర్తింపు కోసం కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అని గుర్తుచేశారు. అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని అసెంబ్లీకి వెళ్లమంటే ఎలా? అని ప్రశ్నించారు. పంతాలు, పట్టింపులకు ఇదేమి సినిమా కాదన్నారు.

(అనంతపురం కరువు, వలసలపై మీడియాతో పవన్ కల్యాణ్)

ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబు చేసిన నీచమైన పని అని, అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అదే చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసినా సరే.. ఒక్కడైనా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఇక తన పోటీ గురించి చెబుతూ.. రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుంచి బరిలో ఉంటానో ఫిబ్రవరిలో స్పష్టత ఇస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు.
కాగా, ఇటీవల జగన్ పవన్ కల్యాణ్ వివాహాల గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ భారతీయ వివాహ వ్యవస్థను అపహాస్యం చేసిన వ్యక్తి అని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలకు అమ్ముడుపోయిన వ్యక్తి అని జగన్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పవన్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.జనసేన టికెట్ కావాలా?: అభ్యర్థులకు పరీక్ష పెడుతున్న పార్టీ
జనసేనకు రామ్ చరణ్ ప్రచారం చేస్తున్నాడా.. బాబాయ్ కోసం అబ్బాయి..
నాగబాబు పవన్ కళ్యాణ్‌ను ముంచుతున్నాడా... తేలుస్తున్నాడా...
ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పవన్ దరఖాస్తు... పోటీ ఎక్కడంటే?
పవన్ కళ్యాణ్ ప్లాన్ బీ: తెలంగాణలో పాగా వేసేందుకు టీమ్
ఏపీ నుంచి పోటీ చేయనున్న తెలంగాణ మాజీ ఎమ్మెల్యే... పవన్ కళ్యాణ్ మద్దతు ?

(అనంతపురం కరువు, వలసలపై మీడియాతో పవన్ కల్యాణ్)
Loading....
Loading...