HOME »NEWS »POLITICS »pawan kalyan reaction on ap legislative council abolish ba

శాసనమండలి రద్దుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్...

శాసనమండలి రద్దుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్...
పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇలాంటి వ్యవస్థలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 133, వ్యతిరేకంగా 0, తటస్థంగా 0 ఓట్లు పడ్డాయి. దీంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనమండలి ఏకగ్రీవ తీర్మానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పునరుద్ధరించిన మండలిని రద్దు చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ముందుచూపుతోనే రెండు సభలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇలాంటి వ్యవస్థలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మండలి రద్దుకు ప్రజాభిప్రాయం తీసుకున్నట్టు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

    మరోవైపు శాసనసభలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శాసనమండలి రద్దు నిర్ణయానికి అనుకూలంగా స్పందించారు. శాసనసభ ఆమోదించి పంపిన రెండు బిల్లులను శాసనమండలి అడ్డుకోవడం దురదృష్ణమన్నారు. మేధావులు, ఇంజినీర్లు, జర్నలిస్టులు, రైతులు, విద్యావేత్తలు ఉన్న శాసనసభ ఆమోదించిన బిల్లును శాసనసభ తిరస్కరించడం సరికాదన్నారు. ఆ ప్రకారం చూస్తే మండలి ఉండడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 27, 2020, 20:12 IST

    टॉप स्टोरीज