బీజేపీతో పవన్ కళ్యాణ్ దోస్తీ... ఏపీలో జోరందుకున్న చర్చ

ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: December 3, 2019, 7:25 PM IST
బీజేపీతో పవన్ కళ్యాణ్ దోస్తీ... ఏపీలో జోరందుకున్న చర్చ
అమిత్ షా, పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... హఠాత్తుగా బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావన తీసుకురావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుపతిలో పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్... దేశానికి అమిత్ షా వంటి నేతల నాయకత్వం అవసరమని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీలో అధికార వైసీపీని ఢీ కొట్టాలంటే బీజేపీలో జనసేనను విలీనం చేయడం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని... అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు ఆయన నోటి వెంట వచ్చాయని పలువురు చర్చించుకుంటున్నారు.

మరోవైపు బీజేపీలో జనసేనను విలీనం చేసే ఆలోచన ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ అమిత్ షాను పొగిడారని ఏపీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అమిత్ షా ప్రస్తావన కేవలం మాట వరసకు తీసుకురాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్... ఆ సందర్భంలోనే బీజేపీ ముఖ్యనేతలతో బీజేపీలో జనసేన విలీనం లేదా దోస్తీ అంశంపై రహస్య చర్చలు జరిపారనే ప్రచారం జరిగింది.

అమిత్ షా లేదా బీజేపీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన చర్చల జరిపారని... అప్పటి నుంచే ఆయన వైసీపీపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. బీజేపీతో జనసేన దోస్తీ లేదా ఆ పార్టీలో జనసేనలో విలీనం చేయడానికి పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారని... ఈ క్రమంలోనే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి అమిత్ షాను పొగిడిన పవన్ కళ్యాణ్... తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారేమో చూడాలి.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>