PAWAN KALYAN NOT INTERESTED TO INVITE CBI EX JD LAKSHMI NARAYANA INTO JANASENA AGAIN AK
Pawan Kalyan: ఆ నేతను లైట్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా ?
పవన్ కళ్యాణ్
Pawan Kalyan: బీజేపీతో జతకట్టి ఏపీలో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. సొంతంగా బలం పెంచుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగి చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు సాధించింది జనసేన. ఆ రకంగా ఏపీలో తమ పార్టీకి బలంగా ఉందని పవన్ కళ్యాణ్ చాటిచెప్పినట్టయ్యింది. బీజేపీతో జతకట్టి ఏపీలో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. సొంతంగా బలం పెంచుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఏపీలో బీజేపీ బలం పుంజుకోకపోయినా.. జనసేన మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించడమే ఇందుకు ఉదాహరణ. ఇదిలా ఉంటే గతంలో జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ.. ఆ తరువాత వివిధ కారణల వల్ల జనసేనకు గుడ్ బై చెప్పారు.
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం నచ్చకే తాను ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు వివరించారు. అయితే ఇటీవల జనసేన సాధించిన ఫలితాలపై ఓ టీవీ డిబెట్లో సానుకూలంగా స్పందించిన లక్ష్మీనారాయణ.. మళ్లీ జనసేనలోకి వచ్చే అంశంపై కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే మళ్లీ జనసేనలోకి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అయితే లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులు గడుస్తున్నా.. జనసేన నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో లక్ష్మీనారాయణను పవన్ కళ్యాణ్ పూర్తిగా లైట్ తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ లేరని.. అందుకే దానిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జనసేన నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలోనూ చేరని లక్ష్మీనారాయణ.. పవన్ కళ్యాణ్ నో ఎంట్రీ బోర్డు పెడితే.. ఏ పార్టీ వైపు చూస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.