జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ... జనసేన చీఫ్ కీలక వ్యాఖ్యలు...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ తర్వాత... పవన్ కళ్యాణ్ కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో వైసీపీ భూదందాకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు.

news18-telugu
Updated: January 23, 2020, 10:34 AM IST
జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ... జనసేన చీఫ్ కీలక వ్యాఖ్యలు...
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
అమరావతి నుంచీ రాజధాని తరలింపును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ... ఢిల్లీ స్థాయిలో వ్యూహరచన చేస్తోంది. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ నేతల బృందం... ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ గురించి జేపీ నడ్డాకు తెలియజేశారు. ప్రధానంగా ఇవాళ్టి భేటీ తర్వాత... రాజధాని తరలింపు ద్వారా... వైసీపీ భూదందాలకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. రాజధాని తరలింపు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతోగానీ... హోంమంత్రి అమిత్ షాతోగానీ... వైసీపీ నేతలు చర్చించలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే విషయమై జేపీ నడ్డాతో మాట్లాడగా... కేంద్రంతో వైసీపీ దీనిపై చర్చించలేదని నడ్డా చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

రాజధాని రైతులకు న్యాయం చేయించే అంశంపై పవన్ కళ్యాణ్... బీజేపీ నేతలు... కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. సమైక్యంగా పోరాడేందుకు అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ - జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాన్, కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహన్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి వంటి నేతలు చర్చించారు. తర్వాత వారు ఈ అంశాలను మీడియాకు వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఓసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 28న మరోసారి తాము భేటీ అవుతామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఇకపై ధర్నాలు, ఆందోళనలు ఏం చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: January 23, 2020, 10:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading