పవన్ పర్యటన.. కాకినాడలో కర్ఫ్యూ వాతావరణం

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో కాకినాడలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ రానీయడం లేదు.


Updated: January 14, 2020, 4:54 PM IST
పవన్ పర్యటన.. కాకినాడలో కర్ఫ్యూ వాతావరణం
కాకినాడలో పవన్ కల్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఆదివారం జరిగిన ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను ఆయన పరామర్శించారు. పంతం నానాజీ ఇంటి వద్ద కార్యకర్తలతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడి ఘటన, ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను తమ అధినేతకు వివరించారు కార్యకర్తలు. ఇక పవన్ పర్యటన సందర్భంగా కాకినాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ రానీయడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ వేళ కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని విమర్శిస్తున్నారు.

కాగా, కాకినాడలో ఈ నెల 12న తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. అనంతరం జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఆ ఘటనలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకే పవన్ కాకినాడకు వెళ్లారు.

Published by: Shiva Kumar Addula
First published: January 14, 2020, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading