మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమావేశం...జనసేన అభ్యర్థులతో చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ,వామపక్షాలతో కలిసి జనసేన పోటీకి దిగింది. జనసేన ఈసారి ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో పోటీకి దిగింది

news18-telugu
Updated: April 21, 2019, 1:42 PM IST
మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమావేశం...జనసేన అభ్యర్థులతో చర్చలు
మంగళగిరిలో పవన్ సమావేశం
news18-telugu
Updated: April 21, 2019, 1:42 PM IST
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ,వామపక్షాలతో కలిసి జనసేన పోటీకి దిగింది.
జనసేన ఈసారి ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో పోటీకి దిగింది. మిత్రపక్షాలైన బీఎస్‌పీ 21, సీపీఐ, సీపీఎం 14 స్థానాల్లో పోటీచేశాయి. మొత్తం 175 స్థానాలకు జనసేన కూటమి పోటీచేసింది.

పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పవన్ జనసేనకు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏపీలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. భీమవరం విషయం పక్కన పెడితే... విశాఖ జిల్లా గాజువాకలో మాత్రం పవన్ గెలుపునకు అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...