బీజేపీలో కీలక పదవి... అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే...

కానీ ఏపీ బీజేపీలో ఇప్పుడు ఆ కీలక పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై మాత్రం పవన్ కళ్యాణ్ అభిప్రాయమే కీలకంగా మారే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

news18-telugu
Updated: January 24, 2020, 7:03 PM IST
బీజేపీలో కీలక పదవి... అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే...
ప్రతికాత్మక చిత్రం
  • Share this:
బీజేపీలో ఎవరికి పదవి ఇవ్వాలనే దానిపై పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉంటుందా అనే సందేహాలు కలగడం సహజం. కానీ ఏపీ బీజేపీలో ఇప్పుడు ఆ కీలక పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై మాత్రం పవన్ కళ్యాణ్ అభిప్రాయమే కీలకంగా మారే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏపీలో కొద్దిరోజుల క్రితం బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఏ రాజకీయ కార్యాచారణ చేపట్టాలన్నా... ఈ రెండు పార్టీలకు సంబంధించిన సమన్వయ కమిటీ కూర్చుని నిర్ణయం తీసుకుంటుందని ఇరు పార్టీలు స్పష్టం చేశాయి.

ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ పదవిపై కేంద్ర నాయకత్వం తీసుకునే పదవిపై పవన్ కళ్యాణ్ ప్రభావం కచ్చితంగా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఉన్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఈ రకంగా ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు సారథులు కాపు సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణే ఉంటారు కాబట్టి... ఏపీ బీజేపీ చీఫ్ పదవిని కాపు సామాజికవర్గానికి కాకుండా మరో సామాజికవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీలు లేదా కమ్మ వర్గానికి ఈ పదవి ఇవ్వొచ్చనే ప్రచారమూ సాగుతోంది. అయితే బీజేపీ, జనసేన పొత్తు కారణంగా కాపు వర్గమే ఈ కూటమి పట్ల ఆకర్షితమవుతుందని... కాబట్టి ఏపీ బీజేపీ చీఫ్ పదవిని మళ్లీ కాపు వర్గానికి చెందిన నేతకే ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సలహాలు, సూచనలను బీజేపీ నాయకత్వం తీసుకోనుందని... ఒక రకంగా అవే ఏపీ బీజేపీ చీఫ్ ఎంపికలో కీలకం కానున్నాయనే టాక్ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు