జనసేనలో మళ్లీ ఆయన హవా... పవన్ కళ్యాణ్‌ సంకేతాలు

పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

త్వరలోనే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని విస్తరించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేశారు.

  • Share this:
    ఇటీవల విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన... ఏపీలోని అధికార పక్షంపై మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఏపీ సీఎం జగన్, వైసీపీపై విమర్శలను మరింత తీవ్రతరం చేశారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమై నిరాశలో ఉన్న జనసేనకు విశాఖ లాంగ్ మార్చ్ ఓ టానిక్‌లా పని చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని విస్తరించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. అయితే జనసేన పొలిటికల్ ఎఫైర్ కమిటీలో కొత్తగా ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
    అయితే ఈ కమిటీలోకి కొత్తగా లక్ష్మీనారాయణను తీసుకుంటారని తెలుస్తోంది. గతంలో లక్ష్మీనారాయణ పార్టీ వీడతారనే ప్రచారం కారణంగా... ఆయనకు ఈ కమిటీలో జనసేన స్థానం కల్పించలేదని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న లక్ష్మీనారాయణ... ఆ తరువాత పవన్ ఏర్పాటు చేసిన సమీక్షల్లో కూడా పాల్గొన్నారు. దీంతో మళ్లీ ఆయనకు పార్టీలో క్రియాశీల బాధ్యతలు అప్పగించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. లక్ష్మీనారాయణతో పాటు విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణకు కూడా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

    First published: