Pawan Kalyan: ఏపీ మంత్రి సీటుపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. అందుకే ఇలా జరుగుతోందా ?

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: రాబోయే ఎన్నికల్లో భీమవరం, గాజువాక కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ పరిశీలనలో మచిలీపట్నం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది.

  • Share this:
    ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది.ఏపీ మంత్రి పేర్ని నాని, సినీనటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. వీరితో పాటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుంది ? ఎక్కడకు దారి తీస్తుందనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఎపిసోడ్‌ కారణంగా జనసేన ఏపీ రాజకీయాల్లో ఎంతో కొంత బలం పుంజుకునే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది. అయితే తాజా వివాదం తరువాత ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ కూడా మొదలైంది.

    వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఊహాగానాలు మొదలైన తరుణంలో.. ఆయన ఏపీ మంత్రి పేర్ని నాని నియోజకవర్గమైన మచిలీపట్నం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. మచిలీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మంత్రి పేర్ని నాని కూడా అదే సామాజికవర్గానికి చెందిన నాయకుడు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి పేర్ని నానికి చెక్ పెట్టేందుకు వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి బరిలోకి దిగాలని ఆయనకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.

    మచిలీపట్నం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం వల్ల కృష్ణా, గోదావరి జిల్లాలోనూ జనసేనకు కొత్త ఊపు వస్తుందని.. అదే సమయంలో జనసేనను, పవన్ కళ్యాణ్‌ను ఎక్కువగా టార్గెట్ చేసే మంత్రి పేర్ని నానికి చెక్ పెట్టినట్టు అవుతుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో భీమవరం, గాజువాక కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ పరిశీలనలో మచిలీపట్నం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్, జనసేనపై తీవ్ర విమర్శలు చేయడంతో.. ఆయనకు చెక్ చెప్పేందుకు జనసేనాని మచిలీపట్నం నుంచి బరిలోకి దిగే అంశాన్ని సీరియస్‌గా పరిశీలించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: