తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ ?

గత ఎన్నికల్లో కోస్తా ఆంధ్రలోని రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్... రాబోయే ఎన్నికల్లో వీలైతే రాయలసీమలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: December 2, 2019, 4:11 PM IST
తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ ?
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా ? తిరుపతిలో రాయలసీమ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్... వివిధ అంశాలపై స్పందించారు. అయితే ఈ సందర్భంగా కొందరు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ను తిరుపతి నుంచి పోటీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. తిరుపతి నుంచి పవన కళ్యాణ్ పోటీ చేస్తే... ఇక్కడ కచ్చితంగా జనసేన విజయం సాధిస్తుందని వారు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ కానీ, జనసేన ముఖ్యనేతలు స్పందించలేదు. గత ఎన్నికల్లో కోస్తా ఆంధ్రలోని రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్... రాబోయే ఎన్నికల్లో వీలైతే రాయలసీమలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే... గతంలో చిరంజీవి పోటీ చేసి విజయం సాధించిన తిరుపతి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలకు మరో నాలుగేళ్లకు పైగా సమయం ఉండటంతో... దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటికప్పుడు స్పందించే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో రాయలసీమలోనూ తన పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్... ఈ క్రమంలో తిరుపతి నుంచి బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.






First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>