మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... ఎందుకో తెలుసా ?

రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వస్తే... పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్నికల్లో రాజకీయంగా అనుకున్న ఫలితాలు సాధించకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: April 18, 2019, 8:21 PM IST
మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... ఎందుకో తెలుసా ?
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 18, 2019, 8:21 PM IST
సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు అంటే ఎంతో ఆసక్తి. తనకు సినిమాల కంటే రాజకీయాలు అంటే ఇష్టమని పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు. తనకు మళ్లీ సినిమాల్లో నటించే ఆలోచన లేదని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితులను బట్టి జనసేన అధ్యక్షుడు మరోసారి ముఖానికి మేకప్ వేసుకునే అవకాశం ఉందని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదని ఇండస్ట్రీలోని పలువురు చర్చించుకుంటున్నారు.

హీరోగా సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతల నుంచి పవన్ కళ్యాణ్ అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీ ఎన్నికల కారణంగా ఆయన సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత వీటి గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారని అప్పట్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వస్తే... పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్నికల్లో రాజకీయంగా అనుకున్న ఫలితాలు సాధించకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు నిర్మాతలకు చెల్లించాల్సిన అడ్వాన్స్‌ల కోసమైనా ఆయన సినిమాలు చేయకతప్పని పరిస్థితి నెలకొందని కొందరి వాదన. అయితే రాజకీయాల్లో ఉన్న నటులు సినిమాల్లో నటించకూడదన్న నిబంధన ఏమీ లేదని... ప్రజలకు ఏదో రకంగా దగ్గర ఉండేందుకు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేముందన్నది మరికొందరి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆయన మరోసారి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తరువాత సినీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...