Home /News /politics /

PAWAN KALYAN MADE INTERESTING COMMENTS ON KAPU CAST IN AP POLITICS AT RAJAHMANUNDRY MEETING FULL DETAILS HERE PRN

Pawan Kalyan on Kapu Caste: కాపులకు పవన్ కల్యాణ్ హితబోధ.. ఆ ముగ్గురిపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రోడ్ల దుస్థితిపై పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం రాజమండ్రిలోని హుకుంపేటలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు కులంపై (Kapu Caste) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రోడ్ల దుస్థితిపై పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం రాజమండ్రిలోని హుకుంపేటలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో కులాల ప్రస్తావన తీసుకొచ్చిన పవన్.. కాపుల (Kapu Caste)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాపులు రాజకీయంగా ముందుండాలన్న పవన్.. గతంలో ఓ గొప్ప వ్యక్తిని సరైన సమయంలో తోడు లేక కోల్పోయారంటూ వంగవీటి రంగాను గుర్తు చేశారు. 2009లో ఒకరు వస్తే ఆయన్ను పలుచన చేశారని చిరంజీవిని గుర్తుచేశారు. , 2014 కాపు ఉద్యమాన్ని అణచివేస్తే అడ్డుకోలేకపోయారంటూ ముద్రగడ ఉగ్యమాన్ని గుర్తుచేశారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు, ఒంటరి ముందుకు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

  కుల పెద్దలు, నాయకులతో మాట్లాడి ఏక్కడ తప్పులు జరిగాయి..? ఎవరి చేతిలో మోసపోయాం..? అనేది ఆలోచించాలలన్నారు. మీరు ముందుకు వస్తే తప్ప శెట్టిబలిజలు, కొప్పుల వెలమ, తూర్పుకాపులు, దళితులు, మైనార్టీలు ముందుకురారని పిలుపునిచ్చారు. సమాజంలో కాపులు పెద్దన్న పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. కమ్మసామాజిక వర్గానికి వ్యతిరేకంగా కాదని చెప్పడానికి టీడీపీకి మద్దతిచ్చినట్లు తెలిపారు.

  ఇది చదవండి: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్... వారికి స్ట్రాంగ్ వార్నింగ్..  కాపులు ఏడు దశాబ్దాలుగా అణచివేతను అనుభవిస్తున్నారని.. “నేను తగ్గాను.. మీరు కూడా తగ్గి ఎలా ఎదగాలో ఆలోచించుకొని ముందుకెళ్లాలి” అని హితబోధ చేశారు. అన్ని కులాలు, మతాలకు మాటిస్తున్నానని.. తుదిశ్వాస వరకు రాజకీయాలను వదిలే ప్రసక్తి లేదన్నారు. వైసీపీని ఎదుర్కొవడం టీడీపీ వల్ల కావడం లేదు.. అందుకే జనసేన వచ్చిందన్నారు. పూర్తిగా సినిమా నటుడ్ని అయితే ప్రభుత్వానికి రూ.20కోట్ల ట్యాక్స్ కట్టగలిగిన సత్తా అని తెలిపారు. ఈ సుదీర్ఘ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలుమూలల నా మట్టిని చల్లండి అని భావోద్వేగమైన పిలుపునిచ్చారు.

  ఇది చదవండి: పవన్ రాజమండ్రి టూర్ లో టెన్షన్.. టెన్షన్.. పోలీసులపై జనసేనాని ఫైర్..


  వైసీపీ నేతలు యుద్ధాని సిద్ధమవండి అని పిలుపునిచ్చారు. నేను మీ జోలికి రాలేదు.. నేను వేళ్తుంటే నన్ను లాక్కొచ్చి నాపై మానసిక అత్యాచారం జరిపారన్నారు. వైసీపీ నేతలు ఏస్థాయిలో కోరుకుంటే ఆస్థాయిలో యుద్ధానికి సిద్ధమని.. ఈ విషయంలో ఎక్కడివరకైనా వెళ్లేందుకు సిద్ధమని పవన్ ప్రకటించారు.

  ఇది చదవండి: రాజమండ్రిలో చిరంజీవి పర్యటన.. కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..  ఇటీవల ఓ మంత్రి నాతో పాటు నేను పుట్టిన కులాన్ని కూడా కలిపి తిట్టారని పవన్ మండిపడ్డారు. నన్ను తిట్టాలంటే తిట్టండి.. జాతి ఏం చేసింది..? మీరు పుట్టిన కులాన్ని మీరే కించపరిస్తే పక్కకులాల వాళ్లు తిట్టకుండా ఉంటారా..? అని ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వీరమహిళలను టార్గెట్ చేసి దూషించారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండని వార్నింగ్ ఇచ్చారు. నాలుగు కాదు ఐదో భాష కూడా నేర్చుకొని తిడతాని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు కమ్మసామాజిక వర్గాన్ని శత్రువులుగా భావిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Kapu Reservation, Pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు